ఎవరెస్ట్ అంత రికార్డ్ కొట్టిన ఎన్టీఆర్…సామి శిఖరం అంతే!!

0
2906

  టాలీవుడ్ తలైవా యూట్యూబ్ రికార్డుల రారాజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి గత ఏడాది ఓ రేంజ్ లో కలిసి రాగా యూట్యూబ్ లో ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ టీసర్ మరియు ట్రైలర్ లు అత్యధిక వ్యూస్ తో అత్యధిక లైక్స్ తో సంచలన రికార్డులు నమోదు చరిత్ర సృష్టించాయి. తర్వాత మిగిలిన హీరోల సినిమాలు జోరు చూపగా వాటికి జియో ఆఫర్ కూడా బాగా కలిసి వచ్చింది. కాగా ఇప్పుడు అన్ని ఆఫర్స్ తగ్గుముఖం పట్టిన సమయంలో ఎన్టీఆర్ మరోసారి దండయాత్ర చేశాడు.

రీసెంట్ గా రిలీజ్ అయిన జైలవకుశ ట్రైలర్ యూట్యూబ్ లో ఏకంగా 20 మిలియన్ వ్యూస్ రికార్డును నమోదు చేసి నాన్ బాహుబలి రికార్డును నమోదు చేసింది. ఇది రియల్ గా అల్టిమేట్ రికార్డ్ అని చెప్పొచ్చు. బాహుబలి ని పక్కకు పెడితే ఇన్నాళ్ళు దువ్వాడ జగన్నాథం టాప్ లో ఉండేది.

17 మిలియన్ కి పైగా వ్యూస్ తో టాప్ లో ఉన్న డీజే సినిమా రికార్డులను బ్రేక్ చేసిన జైలవకుశ ట్రైలర్ ఇప్పుడు బాహుబలి ని పక్కకు పెడితే అత్యధిక వ్యూస్ మరియు లైక్స్ తో టాప్ లో ఉండి అల్టిమేట్ రికార్డ్ తో దూసుకు పోతుంది. త్వరలోనే ఈ ట్రైలర్ 20.5 మిలియన్ అందుకున్నా ఆశ్యర్యపోనవసరం లేదని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here