ఎన్టీఆర్ [నైజాం+కర్ణాటక]..త్రివిక్రమ్ ఓవర్సీస్…భీభత్సం పక్కా

టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ప్రస్తుతానికి టాప్ 3 లో ఉన్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్….క్లాస్ సినిమాలతో అద్బుతమైన రికార్డులు క్రియేట్ చేసిన చరిత్ర త్రివిక్రమ్ సొంతం కాగా ఇప్పుడు పవన్ తో సినిమా చేస్తున్న త్రివిక్రమ్ అది అయిన వెంటనే ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నాడు.

ఆ సినిమా అక్టోబర్ లో మొదలు కాబోతుండగా ఈ సినిమా కి త్రివిక్రమ్ రెమ్యూనరేషన్ ఇప్పుడే ఫిక్స్ అయింది అంటూ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు…ఈ సినిమాకి త్రివిక్రమ్ రెమ్యూనరేషన్ కింద ఓవర్సీస్ రైట్స్ మరియు ప్రాఫిట్స్ లో కొద్దిగా షేర్ తీసుకోబోతున్నాడట.

ఓవర్సీస్ లో ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ ల రేంజ్ కి ఈజీగా 15 కోట్లకు పైగానే బిజినెస్ జరిగే చాన్స్ ఉండగా ప్రాఫిట్స్ లో ఎంత పెర్సేంటేజ్ అనేది తెలియాల్సి ఉంది అంటున్నారు…15 కోట్లు+ ప్రాఫిట్స్ లో అంటే ఈజీగా 20 కోట్లకు పైగానే త్రివిక్రమ్ కి ముట్టే చాన్స్ ఉందని ఇప్పుడు ఇండస్ట్రీలో గట్టిగానే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇవి ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది…

Leave a Comment