ఎన్టీఆర్-పవన్ ల రికార్డులు బ్రేక్ చేయనున్న ఫిదా…టోటల్ ఇండస్ట్రీ షాక్

బాక్స్ ఆఫీస్ దగ్గర ఫిదా దండయాత్ర కొనసాగుతుంది…రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా జోరు తగ్గకుండా దుమ్ము రేపుతున్న ఈ సినిమా సరికొత్త కలెక్షన్స్ రికార్డుతో చిన్న సినిమాల బాహుబలి అని పిలిపించుకుంటుంది.

సినిమా ఇప్పటికే 1.66 మిలియన్ మార్క్ తో కొన్ని పెద్ద సినిమాల రికార్డులు బ్రేక్ చేయగా ఇప్పుడు ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ 1.88 మిలియన్ డాలర్స్, పవన్ అత్తారింటికి దారేది 1.89 మిలియన్ డాలర్స్, ఎన్టీఆర్ నాన్నకుప్రేమతో 2.02 మిలియన్ డాలర్స్ వైపు అడుగులు వేస్తుంది.

కచ్చితంగా మూడో వీకెండ్ ముగిసేలోపు ఈ మూడు సినిమాల రికార్డులు బ్రేక్ అవ్వడం ఖాయామని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ చరిత్రకెక్కే కలెక్షన్స్ తో ఫిదా సాధించిన రికార్డులు ఇకమీదట రాబోతున్న సినిమాలకు బిగ్గెస్ట్ బెంచ్ మార్క్ అనే చెప్పాలి.

Leave a Comment