ఎన్టీఆర్-త్రివిక్రమ్ ఇలా షాక్ ఇచ్చారెంటి…ఫ్యాన్స్ కూడా షాక్

  టాలీవుడ్ తలైవా మూడు వరుస విజయాల హాట్రిక్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశ బాక్స్ ఆఫీస్ దగ్గర 81.5 కోట్ల మార్క్ వైపు అడుగులేస్తూ దూసుకు పోతుండగా ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కాగా ప్రస్తుతం హాలిడే కి వెళుతున్న యంగ్ టైగర్ తిరిగి నవంబర్ చివర్లో త్రివిక్రమ్ తో సినిమా ను మొదలు పెట్టబోతున్నాడు.

కాగా దాంతో డిసెంబర్ నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ అవుతుందేమో అని అంతా అనుకున్నా… ఇప్పుడు స్పష్టంగా వినిపిస్తున్న వార్తల ప్రకారం సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది లో కాదు కదా వచ్చే ఏడాది మూడు నెలలు ముగిసే వరకు మొదలు అయ్యే చాన్స్ లేదట.

పవన్ 25 వ సినిమా తో ఫుల్ బిజీగా ఉన్న త్రివిక్రమ్ జనవరి చివరికల్లా ఫ్రీ కానుండగా ఎన్టీఆర్ అప్పటి వరకు ఈ సినిమా కోసం స్లిమ్ అవ్వబోతున్నాడట. దాంతో పాటు కొన్ని స్పెషల్ ట్రైనింగ్స్ కూడా తీసుకోబోతున్నట్లు సమాచారం. దాంతో ఈ సినిమా షూటింగ్ మార్చి వరకు మొదలు కాదని తెలిసి అభిమానులు కొంత ఫీల్ అవుతున్నారు.

Leave a Comment