చస్…ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కి పూనకాలే..మల్టీస్టారర్ 8 నెలల ముందే స్టార్ట్!!

0
217

  రామ్ చరణ్.. ఎన్టీఆర్.. ఒకరు మెగా హీరో.. మరొకరు నందమూరి హీరో. వీరిద్దరూ కలిసి కనిపిస్తే ఆ లుక్కే వేరుగా ఉంటుంది. ఆఫ్ స్క్రీన్ లో వీరిద్దరూ కలిసి కనిపించడం ఈ మధ్యన ఎక్కువయింది. రాజమౌళి డైరెక్షన్ లో వీరిద్దరూ కలిసి ఆన్ స్క్రీన్ పై కనిపించనున్నారనే వార్తలు వచ్చినప్పటి నుంచి ఈ హంగామా మరింత ఎక్కువగా ఉంది. రీసెంట్ గా ఎన్టీఆర్- చరణ్ ఇద్దరూ కలిసి శంషాబాద్ ఎయిర్ పోర్టులో దర్శనం ఇచ్చారు. ఇద్దరూ బ్యాగులు తగిలించుకుని ఎక్కడికో జర్నీ చేస్తున్నారు.

వీరి వాలకం చూస్తే ఇద్దరూ కలిసే ప్రయాణం చేయబోతున్నారనే సంగతి అర్ధమవుతుంది. ఇంతకీ మెగా పవర్ స్టార్.. యంగ్ టైగర్ లు కలిసి ఎక్కడికి వెళుతున్నారనే ఆసక్తి అందరిలోనూ కనిపించింది. వీరంతట వీరేమీ సమాచారం చెప్పలేదు కానీ.. అసలు విషయం అయితే కలిసి నటించబోయే సినిమా కోసమే అంటున్నారు. వీరిద్దరితో ఓ వర్క్ షాప్ నిర్వహించేదుకు రాజమౌళి సిద్ధమవుతున్నాడనే వార్తలు ఇప్పటికే వచ్చాయి.

అయితే.. ఈ వర్క్ షాప్ ఇండియాలో కాదట. అమెరికాలో ఉంటుందని.. అందుకే ఎన్టీఆర్- చరణ్ ఇద్దరూ కలిసి అక్కడకే బయల్దేరారని అంటున్నారు. అందుకు తగ్గట్లే ఇప్పుడు ఇద్దరూ ఇలా ఎయిర్ పోర్టులో కూడా దర్శనమిచ్చారు. ఓ పది రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుందట. అక్కడే ఓ ఫోటోషూట్ కూడా నిర్వహించే అవకాశాలున్నాయని.. సినిమా ప్రకటన సమయంలో ఈ ఫోటోలు బయటకు వస్తాయని టాక్ వినిపిస్తోంది.

Related posts:

ఫిదా బడ్జెట్, బిజినెస్-లాభం ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
యంగ్ టైగర్ 5G స్పీడ్ తట్టుకోవడానికి ఈ హీరోయిన్ రెడీ!
జైలవకుశ అఫీషియల్ రన్ టైం...బాక్స్ ఆఫీస్ ఊచకోత ఖాయం
చిరు-సుకుమార్ ల గొడవ...టోటల్ ఇండస్ట్రీ షాక్
జైలవకుశ@డే 12...యంగ్ టైగర్ సింహఘర్జన!!
రెండో రోజు రాజా ది గ్రేట్ కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
అదిరింది ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ స్టేటస్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
మెగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తున్న రామ్ చరణ్...హ్యుమంగస్ క్రేజ్ పవర్
||2 గంటల లేట్|| అయినా పవన్ ఫ్యాన్స్ భీభత్సం
టాలీవుడ్ టాప్ 8 ట్రైలర్స్(24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్)
వీళ్ళెం ఫ్యాన్స్ రా బాబు...3 టికెట్స్ కోసం 1.7 లక్షాలా!!...దిమ్మతిరిగిపోయింది!
750-800....నటసింహం...బాలయ్య భీభత్సం ఇది!!
ట్రైలర్ లేకుండానే రిలీజ్ కాబోతున్న తెలుగు సినిమా ఇదే!!
స్పైడర్-అజ్ఞాతవాసి దెబ్బకి టాలీవుడ్ మొత్తం షాక్
మైండ్ బ్లాంక్ అయ్యేలా ఇండస్ట్రీ షాక్ అయ్యేలా NTR 28

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here