ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాకు అజ్ఞాతవాసి ఎఫెక్ట్…కారణం ఇదే!!

0
457

  ఎన్నో అంచనాల నడుమ విడుదలైన అజ్ఞాతవాసి సినిమా ఫైనల్ గా మిక్సిడ్ టాక్ తో ప్రస్తుతం అలా నడిచిపోతోంది. మొదటి షోకే సినిమా కొంచెం నెగిటివ్ టాక్ ను అందుకున్న సంగతి తెలిసిందే. కానీ ఫెస్టివల్ సీజన్ కావడంతో అదృష్టం కొద్దీ ఏదైనా మ్యాజిక్ జరుగుతుందేమో అని అందరు ఎదురుచూస్తున్నారు. ఎక్కువగా అందరు త్రివిక్రమ్ డైరెక్షన్ పైనే నమ్మకం పెట్టుకున్నారు. ఆయన స్టైల్ లో ఉండే ఎంటర్టైన్మెంట్ అలాగే డైలాగ్స్ ఉంటాయని అనుకున్నారు.

కానీ ఏ విధంగా సినిమా పూర్తిగా మంచి టాక్ ను అందుకోలేదు. అయితే ఈ సినిమా రిజల్ట్ ని పక్కనపెడితే.. ఎన్టీఆర్ అభిమానులు కొంచెం ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే తారక్ నెక్స్ట్ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలోనే చేయనున్నాడు. ఫిబ్రవరిలో రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ అవ్వనుంది.

అయితే ప్రస్తుతం అజ్ఞాతవాసి రిజల్ట్ ఎఫెక్ట్ ఆ కథపైన ఏమైనా పడుతుందా అని ఓ వర్గం ప్రేక్షకుల్లో ఆందోళన మొదలైంది. ఈ విషయం పై ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ తో తిరిగి మంతనాలు చేసే ఆలోచనలో ఉన్నాడట…అలాగే సంగీత దర్శకుడిగా తిరిగి దేవి శ్రీ ప్రసాద్ అయితేనే బెటర్ అనే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది…మరి ఎం జరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here