ఇదేమి టైటిల్ సామి…పూనకాలు ఖాయం…కాచుకోండి!! ఇక

0
11368

   టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ టెంపర్, నాన్నకుప్రేమతో, జనతాగ్యారేజ్ లాంటి హిట్స్ తర్వాత చేసిన జైలవకుశ కూడా ప్రేక్షకులను ఏమాత్రం నిరాశపరచకుండా మూడు వరుస విజయాల జాబితాలో చోటు దక్కించుకోగా ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో మొదలు కానున్న ఈ మైటీ మూవీ వచ్చే ఏడాది మార్చి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతున్న విషయం తెలిసిందే.

కాగా ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ ఇండస్ట్రీ లో ఓ టైటిల్ ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. ఆ టైటిల్ ఎన్టీఆర్ కి పెర్ఫెక్ట్ అని కచ్చితంగా మాస్ ఆడియన్స్ కి పూనకాలు తెప్పించే విధంగా ఉందని అంటున్నారు. ఎన్టీఆర్ కెరీర్ లో మొదటి సారిగా ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్న ఈ సినిమా కి…..

అతడే ఒక సైన్యం… అనే టైటిల్ ని అనుకుంటున్నట్లు సమాచారం. త్రివిక్రమ్ సినిమాలు ఎక్కువగా క్లాస్ గా ఉన్నా ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో కి ఇలాంటి టైటిల్ అంటే ఈ సినిమాపై ఇప్పటి నుండే క్రేజ్ పీక్స్ లో పెరిగి పోవడం ఖాయమని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here