#ఎన్టీఆర్28…పూనకాలు తెప్పించే లేటెస్ట్ న్యూస్

0
7248

  మూడు వరుస విజయాల హాట్రిక్ హీరో టాలివుడ్ బాద్ షా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశ ఆడియన్స్ మెప్పు పొంది అద్బుతమైన కలెక్షన్స్ తో దూసుకు పోతుండగా ఎన్టీఆర్ కి నటుడిగా ఎనలేని కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టింది ఈ సినిమా, ముఖ్యంగా జై పాత్రలో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూసి టోటల్ ఇండస్ట్రీ షాక్ అవ్వగా అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇలాంటి విజయం తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ ది.

ఈ సినిమాను మొదట్లో అక్టోబర్ లో మొదలు పెట్టాలని అనుకున్నా త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో చేసిన అజ్ఞాతవాసి వలన ఈ సినిమా సడెన్ గా పోస్ట్ పోన్ అవ్వగా ఫిబ్రవరి చివర్లో ఈ సినిమా మొదలు కాబోతున్న విషయం ఇప్పుడు ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది.

కాగా సినిమాలో ఎన్టీఆర్ అల్ట్రా స్లిమ్ లుక్ లో కనిపించ బోతున్నాడని… అందుకోసం ప్రత్యేక శ్రద్ధ తీసు కోబోతున్నాడన్న విషయం అందరికీ తెలిసిందే…కాగా ఆ స్లిమ్ లుక్ ఎందుకు అనేది ఇప్పుడు తెలిసింది…సినిమాలో ఎన్టీఆర్ కాలేజీ స్టూడెంట్ గా నటించబోతున్నాడు అని అంటున్నారు.

అందుకోసమే స్లిమ్ గా ఉండటానికి … సుమారు ఈ సినిమా కోసం ఎన్టీఆర్ 20 కిలోల బరువు తగ్గ బోతున్నట్లు సమాచారం… ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్నా ఈ సినిమా 2018 దసరా కానుక గా రిలీజ్ కాబో తున్నట్లు ఇప్పుడు ఇండస్ట్రీ లో చెప్పు కుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here