మాస్ హీరో కోసం ఊరమాస్ ఫైట్స్…అప్పుడే 2 అంట…కాచుకోండి!!

0
356

  టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్28 కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. జైలవకుశ రిలీజ్ అయ్యి చాలా రోజులు అవుతున్న నేపధ్యంలో ఈ సినిమా కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కాగా రీసెంట్ గా రెగ్యులర్ షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని ఇప్పుడు అందరు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

త్రివిక్రమ్ అంటే క్లాస్ సినిమాలకు పెట్టింది పేరు…అలాంటి త్రివిక్రమ్ తో ఊరమాస్ హీరో కలిస్తే సినిమా మాస్ గా ఉంటుందా లేక క్లాస్ గా ఉంటుందా అనేది అందరి లోను ఆసక్తిని రేపుతుంది. కాగా సినిమా మొదటి షెడ్యూల్ రీసెంట్ గా పూర్తీ అవ్వగా ఒక ఆసక్తి కరమైన న్యూస్ బయటికి వచ్చింది.

మొదటి షెడ్యూల్ లోనే సినిమా కి సంభందించిన 2 హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ షూటింగ్ జరిగినట్లు సమాచారం. దాంతో సినిమాలో ఇలాంటి యాక్షన్ సీన్స్ కి కొదవ లేదని భారీ ఎత్తున ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలను ఇందులో ఉంచారని చెబుతుండటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here