ఒక్క క్షణం మూవీ ప్రీమియర్ షో రివ్యూ….హిట్టా–ఫట్టా

    కెరీర్ లో హీరోగా నిలదొక్కుకోవడానికి శతవిధాల ప్రయత్నిస్తున్న హీరో అల్లు శిరీష్ శ్రీరస్తు శుభమస్తు సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నా ఏమంత క్రేజ్ ని మాత్రం సొంతం చేసుకోలేదు… కొంత గ్యాప్ తీసుకుని డిఫెరెంట్ కాన్సెప్ట్ తో ఇప్పుడు ఒక్క క్షణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమా డైరెక్టర్ వి.ఐ.ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రీమియర్ షోలు ఓవర్సీస్ లో పూర్తీ అవ్వగా అక్కడ నుండి వచ్చిన టాక్ ఎలా ఉందంటే….

వందల కోట్లమంది ఉంటున్న ఈ ప్రపంచంలో మనలాంటి జీవితం వేరేవాళ్ళకి కూడా ఉండే అవకాశం ఉందని…వాళ్ళ జీవితంలో జరిగిన విషయాలు ఇప్పుడు ఉన్న  వాళ్ళ ప్రస్తుతం జీవితం అవ్వగా ఫ్యూచర్ కూడా వాళ్ళ జీవితం లాగా ఉంటె ఎలా ఉంటుంది అనేది కాన్సెప్ట్…

సినిమా కాన్సెప్ట్ ఎంత ఫ్రెష్ గా ఉందొ తెరకెక్కించిన విధానం కూడా అదే విధంగా ఉందని…ఫస్టాఫ్ అద్బుతంగా సాగగా ఆసక్తి కరమైన ఎలిమెంట్స్ తో ఇంటర్వెల్ ముగిసి సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పీక్స్ లో పెంచుతుందని…సెకెండ్ ఆఫ్ చాలా వరకు అంచనాలకు తగ్గట్లు సాగింది అని అంటున్నారు.

అక్కడక్కడా స్లో అయిన ఫీలింగ్ కలిగినా ఓవరాల్ గా సినిమా సూపర్ అని అంటున్నారు. అల్లు శిరీష్ నటనలో మరింత మెరుగు అవ్వగా హీరోయిన్స్ సురభి అలాగే సీరత్ కపూర్ ఆకట్టుకోగా మరో పాత్ర చేసిన అవసరాల శ్రీనివాస్ కూడా మెప్పించాడని అంటున్నారు.

మొత్తం మీద డిఫెరెంట్ కాన్సెప్ట్ సినిమాలు ఇష్టపడే వారికి సినిమా కచ్చితంగా నచ్చుతుంది…రొటీన్ సినిమాలు చూసి బోర్ అయిన వాళ్ళకి కూడా సినిమా సూపర్బ్ గా ఎక్కుతుందని అంటున్నారు. ఇక్కడ ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో ఇక తెలియాల్సి ఉంది.

Leave a Comment