ఒక్కటి కొడితే ఎన్టీఆర్ శిఖరం ఎక్కడం ఖాయం

0
1144

  మూడు వరుస విజయాల హాట్రిక్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశ బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 80 కోట్ల మార్క్ వైపు అడుగులు వేస్తూ దూసుకుపోతుంది. ఎన్టీఆర్ కెరీర్ లో అల్టిమేట్ రికార్డులు నమోదు చేసిన జనతాగ్యారేజ్ రికార్డులను కూడా బ్రేక్ చేసిన ఈ సినిమా GST వల్ల కలెక్షన్స్ ని భారీగా నష్టపోయింది. అలా జరగక పోయి ఉంటె ఈపాటికే 85 కోట్ల క్లబ్ లో సినిమా చేరేది.

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా GST వల్ల భారీగానే నష్టపోగా ఓవరాల్ గా గ్రాస్ ఇప్పటి వరకు 99 కోట్ల హిస్టారికల్ మార్క్ ని దాటేసి 100 కోట్ల మమ్మోత్ రికార్డ్ వైపు అడుగులు వేస్తుంది. ఈ రికార్డును సినిమా అతి త్వరలోనే అందుకునే చాన్స్ ఉంది.

ఇదే కనుక జరిగితే టాలీవుడ్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో బాక్ 2 బాక్ రెండు 100 కోట్ల గ్రాస్ మార్క్ అందుకున్న ఓకే ఒక్క హీరోగా చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. కాగా ఈ రికార్డ్ దీపావళి లాంగ్ వీకెండ్ పూర్తి అయ్యే సరికి ఎన్టీఆర్ పేరిట వచ్చి పడటం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here