ఒక్క అడుగు దూరంలో ఎవరెస్ట్ అంత రికార్డ్…ఇవాళ ఫినిష్!!

0
465

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సుకుమార్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ రంగస్థలం బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాల్లో అఫీషియల్ గా 100 కోట్ల షేర్ ని 162 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 15 వ రోజు కలెక్షన్స్ తో కలుపుకుని 163 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోగా ఇప్పుడు ఓ హిస్టారికల్ మార్క్ కి ఒక్క అడుగు దూరం లో ఉంది.

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఖైదీనంబర్ 150 నెలకొల్పిన 164 కోట్ల గ్రాస్ మార్క్ కి అతి తక్కువ మొత్తం కలెక్ట్ చేయాల్సి ఉండగా సినిమా 16 వ రోజున కలెక్షన్స్ తో కలిపి కచ్చితంగా 164 కోట్ల గ్రాస్ మార్క్ ని అధిగమించి సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం అని చెప్పొచ్చు.

కాగా ఇప్పటికే చరిత్రకెక్కే రికార్డులను ఎన్నో బ్రేక్ చేసిన ఈ సినిమా ఈ రికార్డును కూడా అందుకుని నయా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది. అతి తక్కువ సమయం లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన నాన్ బాహుబలి సినిమాగా ను చరిత్ర సృష్టించనుంది ఈ సినిమా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here