ఆక్సీజన్ 2 డేస్ టోటల్ కలెక్షన్స్…దిమ్మతిరిగే షాక్ ఇది

  గోపీచంద్ హీరోగా రాశిఖన్నా మరియు అను ఎమాన్యుఎల్ హీరోయిన్స్ గా జ్యోతికృష్ణ దర్శకుడిగా చేసిన సినిమా ఆక్సీజన్. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి సినిమాగా పేరు తెచ్చుకున్నా మొదటి రోజు అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ని రాబట్టలేకపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ఈ సినిమా కి రెండో రోజు మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ జవాన్ నుండి గట్టి పోటి ఎదురు అయ్యింది.

దాంతో రెండో రోజు భారీ డ్రాప్స్ ని ఈ సినిమా దక్కించుకుంది… కాగా మొదటి రోజు మొత్తం మీద 1.59 కోట్ల షేర్ ని అందుకున్న ఈ సినిమా రెండో రోజు 90 లక్షల షేర్ ని మాత్రమె వసూల్ చేసింది. సినిమాకి సెకెండ్ ఆఫ్ కొద్దిగా కలిసి వచ్చింది అని చెప్పాలి.

ఫస్టాఫ్ రొటీన్ కథనే అయినా ఇంటర్వెల్ నుండి సినిమా ఊపు అందుకోగా క్లైమాక్స్ అందరి మెప్పు పొందుతుంది. మరి వీకెండ్ ముగిసే లోపు సినిమా మరింత జోరు చూయిస్తేనే బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సేఫ్ జోన్ లో నిలిచే చాన్స్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఎం జరుగుతుందో చూడాలి,

Leave a Comment