పైసావసూల్ మూవీ రివ్యూ…బాలయ్య ఫ్యాన్స్ కి పూనకాలే కాని ఒకటుంది

0
434

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ పైసావసూల్ నేడు ప్రేక్షకుల ముందుకు భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యింది. పూరీ జగన్నాథ్ మార్క్ మూవీ గా చెప్పుకునే ఈ సినిమా లో బాలయ్య తన దైన స్టైల్ లో పూర్తిగా పూరీ మార్క్ హీరోగా మారిపోయి ప్రేక్షకులను అలరించాడు. మొదటి సీన్ నుండి చివరి సీన్ వరకు అన్నీ తానై సినిమాను ముందుండి నడిపించి అందరి చేత శెభాష్ అనిపించుకున్నాడు.

సినిమా పక్కాగా బాలయ్య కోర్ ఫ్యాన్స్ అందరికీ అలాగే రెగ్యులర్ మాస్ మూవీస్ చూసే ఆడియన్స్ అందరికీ నచ్చడం ఖాయం…కానీ రెగ్యులర్ ఆడియన్స్ కి మాత్రం వన్ టైం చూసే సినిమా ఇదని చెప్పొచ్చు. అలాగని సింపుల్ గా చెప్పడం కష్టం కానీ రెగ్యులర్ ఆడియన్స్ ని కూడా అలరించే అంశాలు బాగానే ఉన్నాయి సినిమా లో.

ఎటొచ్చి సినిమాలో ఫస్టాఫ్, బాలయ్య ఇంట్రోడాక్షన్, బాలయ్య డైలాగ్స్, బాలయ్య న్యూ మ్యానరిజమ్స్ మరియు ఇంటర్వెల్ బ్లాంక్ మెయిన్ హైలెట్స్ లో ముందు నిలిచాయి.

అదే సమయం లో బాలయ్య వాయిస్, హీరోయిన్స్ మరియు సెకెండ్ ఆఫ్ లో స్లో అవ్వడం- అక్కడక్కడ కామెడీ పెద్దగా పండకపోవడం సినిమాకు మేజర్ అండ్ మైనర్ మైనస్ పాయింట్స్..మాస్ ఆడియన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చే పైసా వసూల్ క్లాస్ ఆడియన్స్ అండ్ రెగ్యులర్ ఆడియన్స్ ఒకసారి చూసి ఎంజాయ్ చేసే సినిమా..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here