పైసావసూల్ 3 వ రోజు కలెక్షన్స్….దెబ్బ గట్టిగా తాకింది బాబోయ్

0
375

నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ పైసా వసూల్ బాక్స్ ఆఫీస్ దగ్గర తొలి రెండు రోజుల్లో 12.55 కోట్ల షేర్ ని వసూల్ చేయగా మూడో రోజు ట్రేడ్ లెక్కలు మాత్రం ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడం విచార కరమనే చెప్పాలి. వినాయక నిమజ్జనం కారణంగా ఈవినింగ్ షో లకు కలెక్షన్స్ గట్టి ఎదురు దెబ్బ కొత్తగా పైసా వసూల్ మినిమమ్ కలెక్షన్స్ తో మాత్రమే సర్వైవ్ అవ్వగలిగింది.

దాంతో 3 వ రోజు మొత్తం మీద 2.8 కోట్ల షేర్ ని టోటల్ వరల్డ్ వైడ్ గా 2.9 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేసిన ఈ సినిమా మొత్తంగా మొదటి వీకెండ్ లో 15.4 కోట్ల షేర్ దాకా కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

ఇక అఫీషియల్ కలెక్షన్స్ వివరాలు త్వరలోనే తెలియ నున్నాయి..మాస్ ని ఆకట్టుకుంటున్న ఈ సినిమా క్లాస్ ని మాత్రం ఆకట్టుకోవడం లేదు…బాలయ్య కోర్ ఫ్యాన్స్ అందరూ వీకెండ్ వరకు సినిమాను కాపాడినా ఇప్పటి నుండి సినిమాను కాపాడాల్సిన భాద్యత సామాన్య ప్రేక్షకులదే…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here