పైసా వసూల్ ప్రీమియర్ షో రివ్యూ…మాస్ ఆడియన్స్ కి పూనకాలే

0
336

2017 లో గౌతమి పుత్ర శాతకర్ణి లాంటి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ తర్వాత ఏమాత్రం గ్యాప్ తీసుకో కుండా మరోసారి బాలయ్య పైసా వసూల్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు 9 నెలల గ్యాప్ కూడా తీసుకోక ముందే వచ్చేశాడు. పూరీ జగన్నాథ్ టెంపర్ తర్వాత మళ్ళీ క్లీన్ హిట్ కోసం ఎదురు చూస్తుండగా నేడు సినిమా వీళ్ళ ఆశలను నిలబెడుతుందో లేదో చూడాలి.

ముందుగా ఓవర్సీస్ మరియు రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో స్పెషల్ షోల నుండి వస్తున్న టాక్ ప్రకారం సినిమా పక్కా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే సినిమా అని అంటున్నారు. అదే సమయం లో సినిమా కామన్ ఆడియన్స్ కి ఒకసారి ఈజీగా చూసే కమర్షియల్ మూవీ అని అంటున్నారు. ఒకేవేల రెగ్యులర్ ఆడియన్స్ కి సినిమా కనుక కనెక్ట్ అయితే సినిమా మంచి విజయం సాధించడం ఖాయమని అంటున్నారు.

సినిమాలో హైలెట్స్ ఫస్టాఫ్, బాలయ్య డైలాగ్స్ మరియు మ్యానరిజంస్, టైటిల్ సాంగ్ మరియు ఇంటర్వెల్ సీన్ అని అంటున్నారు..బాలయ్య వాయిస్ కొద్దిగా తేడా గా ఉండటం, సెకెండ్ ఆఫ్ కొద్దిగా స్లో గా ఉండటం సినిమా మైనర్ మైనస్ పాయింట్స్ అని అంటున్నారు. ఇక రెగ్యులర్ షోల కి కూడా ఇదే టాక్ తెచ్చుకుంటే బాలయ్య ఖాతాలో హిట్ పడినట్లే అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here