పైసా వసూల్ టోటల్ కలెక్షన్స్…అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ పైసా వసూల్…. మొదటి రోజు అనుకున్న రేంజ్ కన్నా సూపర్బ్ గా ఓపెన్ అయిన ఈ సినిమా తర్వాత మాత్రం అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యింది…. తర్వాత ఏ దశ లోను కోలుకునే విధంగా కనిపించని ఈ సినిమా మొత్తం గా బాక్స్ ఆఫీస్ పరుగును 2 వారాలు ముగిసే లోపే ఆపేసి సినిమాను కొన్న వారికి నష్టాలను గట్ టిగానే మిగిలించింది అని చెప్పొచ్చు.

సినిమా మొత్తం మీద ప్రీ రిలీజ్ బిజినెస్ 32.5 కోట్ల అవ్వగా 33.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా టోటల్ రన్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 18 కోట్ల షేర్ ని టోటల్ వరల్డ్ వైడ్ 1.5 కోట్ల షేర్ ని అందుకుని మొత్తంగా 19.5 కోట్ల షేర్ ని అందుకుంది.

దాంతో మొత్తం మీద 14 కోట్ల మేర నష్టపోయిన ఈ సినిమా బాలయ్య కెరీర్ లో భారీ నష్టాలు మిగిలించిన సినిమాల జాబితా లో ఎంటర్ అయ్యింది. కాగా ఇప్పుడు బాలయ్య నటిస్తున్న అప్ కమింగ్ మూవీ “జైసింహా” సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఆ సినిమా ఈ రిజల్ట్ ని మరిపిస్తుందని అందరూ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Comment