పైసావసూల్ ట్రైలర్..[అరాచకం] సృష్టించిన బాలయ్య…కానీ ఇదేంటి!!

0
1496

గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ తర్వాత పక్కా కమర్షియల్ డైరెక్టర్ అయిన పూరీజగన్నాథ్ దర్శకత్వంలో పైసావసూల్ సినిమాతో ప్రేక్షకులముందుకు రానున్నాడు బాలయ్య..సెప్టెంబర్ 1 న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఆడియో మరియు ట్రైలర్ ను రీసెంట్ గా లాంచ్ చేశారు.

ట్రైలర్ లో బాలయ్య మ్యానరిజంస్ అలాగే డైలాగ్ డిలివరీ పూరీజగన్నాథ్ హీరోల మాదిరిగానే ఉంటూ అలరించగా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీ అని ట్రైలర్ నిరూపించింది. బాలయ్య కోర్ మాస్ ఆడియన్స్ కి తెగ నచ్చేసిన ఈ ట్రైలర్ మాస్ ఆడియన్స్ ని ఉర్రూతలూగించడం ఖాయమని అంటున్నారు.

ఎటొచ్చి ట్రైలర్ లో బాలయ్య వాయిస్ మునుపటిలా లేదని ప్రతీ ఒక్కరు చెబుతుండటం ట్రైలర్ కి మైనస్ గా మారింది. ఒక్కసారి గౌతమీపుత్ర శాతకర్ణి ట్రైలర్ ని చూసి మళ్ళీ ఈ ట్రైలర్ ని చూస్తె వాయిస్ లో తేడా ఈజీగా కనిపెట్టవచ్చు…సినిమాలో బాలయ్య తేడా సింగ్ రోల్ చేస్తున్నందున వాయిస్ ని మార్చారు అనేవాళ్ళు కూడా ఉన్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here