అజ్ఞాతవాసి రిజల్ట్ తో ఫ్యాన్స్ షాకింగ్ కామెంట్స్…ఏకంగా పవన్ మీదే!!

0
422

  సినిమాలు మానేస్తానని పవన్‌కళ్యాణ్‌ ప్రకటించి నపుడు ఫాన్స్‌ తెగ ఫీల్‌ అయిపోయారు. అత్తారింటికి దారేది సినిమాతో కెరియర్‌ పీక్‌ దశకి చేరుకున్న తర్వాత పవన్‌ రిటైర్‌ అవుతా ననడం ఫాన్స్‌ని బాధించింది. అయితే ఆ తర్వాత పవన్‌ చేసిన సినిమాలు చూసి విసిగిపోయిన అభిమానులు ఇప్పుడు పవన్‌ని రిటైర్‌ అయిపోమని రిక్వెస్ట్‌ చేస్తున్నారు. ఏమాత్రం జాగ్రత్త తీసుకోకుండా, కనీసం ఆసక్తి చూపించ కుండా పవన్‌ చేస్తోన్న ఇర్రెస్పాన్సిబుల్‌ సినిమాలు ఫాన్స్‌కి విరక్తి తెప్పించాయి.

ఇంతకాలం త్రివిక్రమ్‌తో సినిమా వస్తుందనే ఆశ వుండేది. అజ్ఞాతవాసితో ఆ ఆశ కూడా చచ్చిపోయింది. కథ మీద కనీస శ్రద్ధ తీసుకోకుండా, తనకున్న ఇమేజ్‌ని టేకిట్‌ ఫర్‌ గ్రాంటెడ్‌గా తీసుకుంటూ ఇష్టానికి సినిమాలు చేస్తోన్న పవన్‌తో ఫాన్స్‌కి చిరాకొచ్చేసింది. ఇలా సినిమా వచ్చిన ప్రతిసారీ అవమాన భారం పడే కంటే పూర్తిగా సినిమాలు మానేసాడని ఒకేసారి బాధ పడి ఊరుకోవచ్చునని వారు అనుకుంటున్నారు.

రాజకీయాలు, సినిమా అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తోన్న పవన్‌ కనీసం రాజకీయ రంగంలో అయినా ముద్ర వేయాలని కోరుకుంటున్నారు. మళ్లీ మరో సినిమా చేద్దామనే ఆలోచన కూడా పెట్టుకోకుండా ఇంతటితో సినీ ప్రస్థానానికి ముగింపు పలకాలని కోరుతున్నారు. మరి ఈ విన్నపాలు పవర్‌స్టార్‌ వరకు వెళుతున్నాయో లేదో. అసలిప్పుడు పవన్‌ ఆలోచనలు ఎలాగున్నాయో?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here