ఏంటయ్యా పవర్ స్టార్…ఏంటి ఈ రికార్డ్ అసలు…16 గంటలు…??

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సోషల్ మీడియా లో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో కొత్తగా చెప్పేది ఏముంది… అత్తారింటికి దారేది తర్వాత సరైన హిట్ లేకున్నా పవన్ మూవీస్ కి వచ్చే రెస్పాన్స్…యావరేజ్ సినిమాలతో నే పవన్ కళ్యాణ్ సృష్టించిన ఓపెనింగ్స్ రికార్డ్స్ అన్నీ ఇన్నీ కావు. కాగా ఇప్పుడు ప్రతిష్టాత్మక 25 వ సినిమా తో వస్తున్న పవన్ కళ్యాణ్ రీసెంట్ గా తన సినిమా లోను ఫస్ట్ సాంగ్ ని లాంచ్ చేశారు.

కాగా సోషల్ మీడియా లో ఈ సాంగ్ రిలీజ్ రోజున డైరెక్టర్ త్రివిక్రమ్ పుట్టినరోజు కూడా ఉన్న ఈ సాంగ్ మాత్రం నేషనల్ వైడ్ గా కొద్ది సేపు వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అయ్యి సంచలనం సృష్టించింది. పవన్ ఫ్యాన్స్ ఈ సాంగ్ లిరిక్ వీడియోకి యూట్యూబ్ లోను రికార్డ్ వ్యూస్ వచ్చేలా చేశారు.

సుమారు సాంగ్ 16 గంటల పాటు ఇండియా లో టాప్ 3 లో వరుసగా చోటు మారుస్తూ ట్రెండ్ అవ్వడం విశేషం అనే చెప్పాలి. ఒక సాంగ్ రిలీజ్ కే ఈ రేంజ్ అంటే ఫస్ట్ లుక్ టీసర్ రిలీజ్ అయ్యాక రచ్చ ఎ రేంజ్ లో ఉంటుందో అని ఇప్పుడు అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

Leave a Comment