వీళ్ళెం ఫ్యాన్స్ రా బాబు…3 గంటల్లో రచ్చ రచ్చ చేశారు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే… పవన్ కి సంభందించిన ఎ చిన్న న్యూస్ అయినా సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో ట్రెండ్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం… ఇప్పుడు పవన్ కళ్యాణ్ కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమాగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి కోసం పవన్ కళ్యాణ్ అభిమానులే కాకుండా టోటల్ టాలీవుడ్ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తుంది…

కాగా రీసెంట్ గా సినిమా లోని ఒక్కో సాంగ్ ని రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే…త్రివిక్రమ్ పుట్టినరోజున బైటికొచ్చి చూస్తె సాంగ్ ని రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో ఆ సాంగ్ ఓ సంచలనం సృష్టించిగా ఇప్పుడు సినిమా లో మరో సాంగ్ #గాలివాలుగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

ఇలా ఆన్ లైన్ లో రిలీజ్ అయిన మూడు గంటల్లోనే వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అవుతూ భీభత్సం సృష్టించింది ఈ సాంగ్… అనిరుద్ పాడిన సాంగ్ కూడా అద్బుతంగా ఉండటంతో సోషల్ మీడియా లో అభిమానులు ఓ రేంజ్ లో సందడి చేస్తున్నారు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక రచ్చ ఎలా ఉంటుందో మరి…

Leave a Comment