పవన్ 23.7…రామ్ చరణ్ 23.8…ఎవ్వరూ టచ్ చేయని రికార్డ్!!

0
471

  టాలీవుడ్ చరిత్రలో ఎన్నో సినిమాలు అనుకున్న అంచనాలను అందుకుని చరిత్రకెక్కాయి. కొన్ని సినిమాలు నెలకొల్పిన రికార్డులు ఇప్పటికీ కొనసాగుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తుండగా ఇప్పుడు 5 ఏళ్లుగా టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెలకొల్పిన ఓ రేర్ ఇండస్ట్రీ రికార్డుకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. ఆ రికార్డును బ్రేక్ చేసింది మరెవరో కాదు స్వయానా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అవ్వడం తో మెగా అభిమానుల్లో ఆనందం మరింత పెరిగింది అనే చెప్పాలి.

రంగస్థలం సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలవగా సినిమా నైజాం ఏరియాలో పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది నెలకొల్పిన 5 ఏళ్ల రికార్డ్ అయిన 23.7 కోట్ల ఇండస్ట్రీ రికార్డ్ ను బ్రేక్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ప్రస్తుతం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 18 రోజుల్లో 23.8 కోట్ల షేర్ ని అందుకోగా ఇప్పుడు 24 కోట్ల షేర్ మార్క్ ని కూడా క్రాస్ చేసి మరింత జోరుగా సరికొత్త బెంచ్ మార్క్ ని రాబోతున్న పెద్ద సినిమాల కోసం సెట్ చేయనుంది. టోటల్ రన్ లో రంగస్థలం సినిమా ఎంత పెద్ద టార్గెట్ ని సెట్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here