కర్ణాటక స్టేట్ దద్దరిల్లింది సామి….పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఫస్ట్ టైం

  రెండు తెలుగు రాష్ట్రాల తర్వాత పక్క రాష్ట్రం కర్ణాటక లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. రెండు వరుస ఫ్లాఫ్స్ ఉన్నా పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి పై నెలకొన్న హైప్ అంతా ఇంతా కాదు. జనవరి 10 న అత్యంత భారీ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కర్ణాటకలో కూడా అల్టిమేట్ లెవల్ లో రిలీజ్ కానుంది.

కాగా ఇక్కడ విశేషం ఏంటి అంటే ఇండియా లో అన్ని షోల కన్నా ముందు మొట్టమొదటి సారిగా పవన్ కళ్యాణ్ మూవీ షో కర్ణాటక లోని బెంగుళూరు లో పడబోతున్నట్లు సమాచారం…. జనవరి 9 సాయంత్రం 6:30 నిమిషాలకు మొదటి షో పడబోతుందట.

దాంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో దుమ్ము లేపుతుండగా కర్ణాటకలో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తూ దూసుకు పోతున్నారు, పవన్ కళ్యాణ్ కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందా అని ఇప్పుడు టోటల్ టాలీవుడ్ ఎంతో ఆశగా ఎదురు చూస్తుంది.

Leave a Comment