పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్ ఇది…నిజం అయితే రచ్చె!!

0
595

  త్రివిక్రమ్ దర్శకత్వం లో ‘అజ్ఞాతవాసి’ చేసిన పవన్ కల్యాణ్, ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేక పోయారు. అందువలన సాధ్యమైనంత త్వరలో మరో సినిమా చేయాలని నిర్ణయించుకున్నట్టు గా సమాచారం. రాజకీయ నేపథ్యం కలిగిన చిత్రమైతే రెండు విధాలుగా కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నట్టు గా ఫిల్మ్ నగర్ టాక్. తాను అనుకుంటున్న తరహా కథకి బోయపాటి అయితే బాగుంటుందని పవన్ భావించాడని అంటున్నారు. ఆల్రెడీ పవన్ ఆఫీస్ నుంచి బోయపాటికి ఫోన్ వెళ్లిందని చెబుతున్నారు.

బోయపాటికి పవన్ అపాయింట్ మెంట్ కూడా ఖరారు అయిందని అంటున్నారు. మాస్ యాక్షన్ మూవీలకు పెట్టింది పేరైన బోయపాటి .. పవన్ కోసం ఎలాంటి కథను సిద్ధం చేస్తాడో చూడాలి మరి. చరణ్ తో సినిమా మొదలుపెడుతుండగానే .. పవన్ నుంచి ఫోన్ రావడంతో, బోయపాటి సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడట.

కాగా ప్రస్తుతం రామ్ చరణ్ తో సినిమా చేయనున్న బోయపాటి పవన్ తో అన్నీ ఓకే అయితే సినిమా ను ఈ ఇయర్ సెకెండ్ ఆఫ్ లో మొదలు పెట్టె అవకాశం ఉందని అంటున్నారు…కొంచం డిలే అయినా ఈ ప్రాజెక్ట్ కనుక ఓకే అయితే పవర్ స్టార్ రియల్ మాస్ పవర్ చూపించే సినిమాతో బోయపాటి రచ్చ చేయడం ఖాయం అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here