15 ఏళ్ళు పూర్తి చేసుకున్న బాహుబలి ప్రభాస్!

ఈశ్వర్ సినిమాతో 2002 లో టాలీవుడ్ లో అడుగుపెట్టిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్…తర్వాత అంచలంచలుగా ఎదిగి ఇప్పుడు ఏకంగా ఆల్ ఇండియా స్టార్ హీరోలలో పాన్ ఇండియా మార్కెట్ ని సొంతం చేసుకున్న హీరోగా నిలిచాడు. కాగా ఇండస్ట్రీ లో అడుగు పెట్టి 15 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.

వర్షం, ఛత్రపతి, లాంటి సినిమాలతో మాస్ ఫాలోయింగ్ ను, డార్లింగ్ మిస్టర్ పెర్ఫెక్ట్ లాంటి సినిమాలతో క్లాస్ ఫాలోయింగ్ ను…మిర్చి తో ఫ్యామిలీ ఆడియన్స్ ని తన వైపు తిప్పుకున్న ప్రభాస్ బాహుబలి తో శిఖరం ఎక్కాడు. ప్రస్తుతం కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న ప్రభాస్…సాహో తో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

Leave a Comment