సినిమాకు పెట్టింది 30….వచ్చింది ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

 సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన లేటెస్ట్ మూవీ PSV గరుడ వేగ…. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా అద్బుతమైన సినిమాగా అందరి మన్నలను సొంతం చేసుకుని యునానిమస్ హిట్ టాక్ తెచ్చుకున్నా సరైన సమయం లో రిలీజ్ చేయలేకపోవడంతో అనుకున్న రేంజ్ వసూళ్లు రాబట్టడం లేదు. కానీ సినిమా కి ఓవర్సీస్ లో మాత్రం మంచి వసూళ్లు రాగా పెట్టిన పెట్టుబడికి అద్బుతమైన లాభాలు తెచ్చి పెట్టింది ఈ సినిమా.

సినిమా ఓవర్సీస్ రైట్స్ సుమారు 30 లక్షలకు అమ్ముడు పోగా సినిమా ఇప్పటి వరకు అక్కడ హాల్ఫ్ మిలియన్ మార్క్ అంటే 3 కోట్లకు పైగా గ్రాస్ ని వసూల్ చేసి రాజశేఖర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓవర్సీస్ హిట్ గా నిలిచి సంచలనం సృష్టించింది ఈ సినిమా.

కాగా ఆ మొత్తం లో 1.5 కోట్ల షేర్ ఉండటం తో సినిమాకి దాదాపు 5 రెట్ల లాభం వచ్చినట్లు అయింది. కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సినిమా ఇంకా సేఫ్ అవ్వాలి అంటే మరింత కష్టపడక తప్పని పరిస్థితి..మరి సినిమా ఎంత దూరం వెళుతుందో చూడాలి.

Leave a Comment