నిర్మాతల అఫీషియల్ అనౌన్స్ మెంట్..జైలవకుశ ఫుల్ కలెక్షన్స్ ఇవే

0
6003

  టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ కలెక్షన్స్ తొలి వారం లో చరిత్ర సృష్టించగా రెండో వారం కొత్త సినిమాల నుండి పోటి తీవ్రంగా ఉండగా దసరా సెలవులో మంచి వసూళ్లు సాధించి దసరా వీకెండ్ అయ్యే సరికి సూపర్బ్ కలెక్షన్స్ ని సాధించింది. కాగా దసరా సెలవుల తర్వాత మళ్ళీ స్లో అయిన జైలవకుశ ఓవరాల్ గా 2 వారలను ఘనంగా ముగించింది.

మొత్తం మీద 76.13 కోట్ల షేర్ ని 130 కోట్లకి పైగా గ్రాస్ ని కలెక్ట్ చేసిన జైలవకుశ సినిమా కలెక్షన్స్ ట్రేడ్ లెక్కల్లో ఉండగా ఇప్పుడు ఇవే కలెక్షన్స్ ని అఫీషియల్ గా నిర్మాతలు అనౌన్స్ చేయడం తో అందరిలోనూ మరింత క్లారిటీ వచ్చింది అని చెప్పొచ్చు.

రెండు వారాల్లో 76+ కోట్లకు పైగా షేర్ అలాగే 130+కోట్లకు పైగా గ్రాస్ తో దసరా బ్లాక్ బస్టర్ గా జైలవకుశ నిలిచిందని రిలీజ్ చేసిన పోస్టర్ తో ఎన్టీఆర్ అభిమానులు కలెక్షన్స్ తెలుసుకుని ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి సినిమా లాంగ్ రన్ లో మరెంత దూరం వెళుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here