పెట్టింది 25 కోట్లు…అమ్మింది 12.5 కోట్లు…వచ్చింది ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

0
3826

  సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన లేటెస్ట్ మూవీ PSV గరుడ వేగ….. చాలా కాలంగా క్లీన్ హిట్ కోసం ఎదురు చూస్తున్న రాజశేఖర్ కి PSV గరుడ వేగ తో మంచి హిట్ టాక్ వచ్చిన మూవీ లభించి తిరిగి కంబ్యాక్ చేయడాని కి భారీ గా ఉపయోగ పడినా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా సాధించిన కలెక్షన్స్ చూస్తె మాత్రం షాకింగ్ గా అనిపించక మానదు అని చెప్పొచ్చు.

సినిమా మొత్తం మీద 25 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కిన విషయం తెలిసిందే…కానీ అన్ని ఏరియాల్లో అంత రేటు పెట్టడానికి ఎవ్వరూ సిద్ధం లేకపోవడంతో చాలా ఏరియాల్లో సినిమాను ఓన్ గా రిలీజ్ చేసుకోవాల్సిన అవసరం నెలకొంది. దాంతో ఓవరాల్ గా 12.5 కోట్ల థియేట్రికల్ వాల్యూ తో సినిమా రిలీజ్ అయ్యింది.

కాగా మంచి హిట్ టాక్ తెచ్చుకున్నా టోటల్ రన్ లో కేవలం 8.1 కోట్ల షేర్ ని మాత్రమే సాధించి అందరికీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది ఈ సినిమా. దాదాపు 4.4 కోట్ల నష్టాలను దక్కించుకున్న ఈ సినిమా హిట్ టాక్ తోనూ బ్రేక్ ఈవెన్ కాలేక పోయింది. కానీ నటుడిగా రాజశేఖర్ కి మంచి పేరు తీసుకువచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here