రాజా ది గ్రేట్ హిట్ అవ్వాలి అంటే ఎంత కలెక్ట్ చేయాలో తెలుసా??

0
689

  బెంగాల్ టైగర్ సినిమా తర్వాత భారీ గ్యాప్ తీసుకున్న మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాజా ది గ్రేట్ ప్రేక్షకుల ముందుకు వచ్చేయడానికి సిద్ధం అయ్యింది. ఒకప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ మినిమమ్ గ్యారెంటీ హీరో గా చెడుగుడు ఆడేసుకున్న మాస్ మహారాజ్… తర్వాత కొద్దిగా స్లో అవ్వగా తన లుక్ ని ఫిజిక్ ని టోటల్ గా మార్చేసుకుని ఇప్పుడు రాజా ది గ్రేట్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు.

పటాస్, సుప్రీమ్ లాంటి రెండు బ్లాక్ బస్టర్స్ తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 30 కోట్లకు పైగా బిజినెస్ ని సాధించి సంచలనం సృష్టించింది. నైజాంలో 8.5 కోట్లు, సీడెడ్ లో 5.5 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా టోటల్ ఆంద్రాలో 12 కోట్ల బిజినెస్ చేసింది.

ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో కలిపి 4.2 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 30.2 కోట్ల బిజినెస్ చేయగా క్లీన్ హిట్ కి ఇప్పుడు 31 కోట్లకు పైగా షేర్ ని కలెక్ట్ చేయాల్సిన అవసరం నెలకొంది. మరి సినిమా జోరు ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here