రాజా ది గ్రేట్…రివ్యూ…సూటిగా సుత్తి లేకుండా??

    రెండేళ్ళ భారీ గ్యాప్ తర్వాత మాస్ మహారాజ్ రవితేజ తనని తాను పూర్తిగా మార్చుకుని ప్రేక్షకుల ముందుకు రాజా ది గ్రేట్ అంటూ అంధుడి రోల్ లో అలరించడానికి వచ్చేశాడు. అంధుడి రోల్ లో సినిమా అంటే సెంటిమెంట్ పాళ్ళు ఎక్కువగా ఉంటాయని అనుకున్న వాళ్లకి షాక్ ఇస్తూ పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించిన రాజా ది గ్రేట్ సినిమా అనిల్ రావిపూడి కి హాట్రిక్ ని రవితేజ కి మంచి కంబ్యాక్ ఇచ్చిందా లేదా చూద్దాం పదండీ…

సినిమా మొదటి అర్ధభాగంలో హీరో అంధుడే అయినా మామూలు వ్యక్తుల కన్నా పవర్ ఫుల్ గా ఉండటం ఆకట్టుకుంటుంది. ఫస్టాఫ్ మొత్తం సరదా సరదా గా సాగిపోతూ అలరిస్తుండగా హీరోయిన్ ఎంట్రీ ఆమె కి ఒక ప్రాబ్లం ఆ ప్రాబ్లం ని ఓ అందుడైన హీరో ఎలా సాల్వ్ చేశాడు అనేది కథ.

రొటీన్ కథనే అయినా హీరో అంధుడు అవ్వడం తో ఆసక్తిగా సినిమాను ఎంటర్ టైనర్ గా నడపడంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి సూపర్ సక్సెస్ అయినా సెకెండ్ ఆఫ్ లో సినిమా స్లో అవ్వడం మేజర్ మైనస్ పాయింట్స్…అలాగే హీరో అంధుడే అయినా….

కొన్ని సన్నివేశాల్లో నిజంగా కళ్ళు ఉన్నవాళ్ళకన్నా యాక్టివ్ ఉండటం కొద్దిగా వింతగా అనిపిస్తుంది. ఇదంతా పక్కకు పెడితే మంచి ఎంటర్ టైనర్ గా రాజా ది గ్రేట్ ని చెప్పుకోవచ్చు. రవితేజ మంచి కంబ్యాక్ చేశాడు ఈ సినిమాతో అని చూసినవాళ్లు బయటికి వస్తు చెబుతారు.

అనిల్ రావి పూడి పెద్దగా ప్రయోగాలు చేయకుండా తాను ఎందులో సిద్ధహస్తుడో అది చేస్తూ కామెడీని నమ్ముకుని సినిమాను సేఫ్ జోన్ లో నడిపాడు. మొత్తం మీద సినిమా అటు అనిల్ రావిపూడికి ఇటు రవితేజకి మంచి విజయం గా మిగిలే అవకాశం అయితే పుష్కలంగా ఉందని చెప్పొచ్చు.

Leave a Comment