ఆ కత్తి ఎప్పటికైనా ఎన్టీఆర్ దే అంటూ… కామెంట్స్ చేసిన జక్కన్న

0
5627

  టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు వచ్చిన సినిమాలలో బెస్ట్ వెపన్స్ లో అన్నీంటికన్నా ముందు చెప్పుకునే ఆయుధం సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్ వాడిన ఆయుధం అనే చెప్పాలి..అంతకుముందు వచ్చిన సినిమాలు కానీ తర్వాత వచ్చిన సినిమాల్లో కానీ ఆ కత్తిని మించిన కత్తి రాలేదు. కాగా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో సింహాద్రి డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి ఆ కత్తిని మరో సినిమాలో ఎందుకని వాడలేదు అని అడగ్గా ఆ కత్తి ఎప్పటికైనా ఎన్టీఆర్ కే సొంతం….

ఎన్టీఆర్ తప్ప మరెవరు ఆ కత్తిని వాడకూడదు అని చెప్పాడట. కాగా ఎన్టీఆర్ కూడా సింహాద్రి తర్వాత ఎందుకనో ఇప్పటివరకు ఆ కత్తిని టచ్ చేయలేదు… సరైన కథ దొరికినప్పుడు కచ్చితంగా సినిమాలో ఎదో ఒక చోట ఆ కత్తిని వాడుటాడని సన్నిహుతులు చెబుతున్నారట…

ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఎన్టీఆర్ మరోసారి సింహాద్రి కత్తి పట్టుకుంటే చూడాలని ఉందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం బాహుబలి తర్వాత స్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న జక్కన్న ఎన్టీఆర్ తోనే సినిమా చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ లో చెప్పుకుంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో అతి త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here