రాజుగారిగది2 జెన్యూన్ రివ్యూ అండ్ రేటింగ్

0
1170

    యాంకర్ నుండి డైరెక్టర్ గా మారిన ఓంకార్ నుండి వచ్చిన జీనియస్ డిసాస్టర్ అయినా తిరిగి తనని తాను మార్చుకుని చేసిన రాజుగారిగది మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా ను కొన్న వాళ్ళందరికీ ఊహించని లాభాలను తెచ్చి పెట్టింది. అలాంటి సినిమాకు సీక్వెల్ గా రాజుగారిగది2 రావడం అందులో నాగార్జున సమంతలు ముఖ్య పాత్రలు పోషించడం తో మంచి అంచనాలతో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా.

కాగా కథ పెద్దగా చెప్పడానికి లేకున్నా మొదటి అర్ధభాగం అక్కడక్కడ మంచి కామెడీ సీన్స్ తో అలాగే భయపెట్టే సీన్స్ తో నిండిపోగా తమన్ తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టేశాడు. ఇక నాగార్జున ఎంట్రీ సీన్ నుండి సినిమా గ్రాఫ్ పెరుగు పోయింది. అలా అలా మొదటి అర్ధభాగం పడుతూ లేస్తూ మొత్తానికి ఆకట్టుకుంది.

ఇక సెకెండ్ ఆఫ్ స్లో గా మొదలై సమంత ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ తో పూర్తి ఎమోషనల్ గా సాగగా సమంత తన లోని నటిని మరోసారి ఆవిష్కరించి ఆకట్టుకుంది. సెకెండ్ ఆఫ్ లో సగం సినిమాను తన భుజాన మోసింది. మొత్తంగా మొదటి అర్ధభాగం కామెడీ అలాగే సెకెండ్ ఆఫ్ సెంటిమెంట్ తో కూడుకున్నది.

ఓంకార్ ఈ సినిమాతో అటు యూత్ ని ఇటు ఫ్యామిలీస్ ని ఆకట్టుకున్నాడు…2 గంటలే ఉండటం సినిమాకు ప్లస్ పాయింట్…అక్కడక్కడ బోర్ కొట్టినా వెంటనే మరో సీన్ ఆ సీన్ ని రిప్లేస్ చేయడం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. మొత్తం మీద పాస్ మార్కులు వేయించుకున్న రాజుగారిగది 2….

కచ్చితంగా 3 స్టార్ రేటింగ్ దక్కించుకునే సినిమా అనే చెప్పాలి. సెకెండ్ ఆఫ్ లో సెంటిమెంట్ ఎక్కితే సినిమా మరింత ప్రేక్షకాదరణ సొంతం చేసుకునే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు. దీపావళి లాంగ్ వీకెండ్ లో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో అనేదానిపై సినిమా విజయావకాశాలు ఆదారపడిఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here