మెగా పవర్ స్టార్ అడుగుపెడుతున్నాడు…ఈ సినిమా జాతకం మారుతుందా

0
5113

టాలీవుడ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ని జాతీయ స్థాయి నుండి ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళిన చరిత్ర ఎస్.ఎస్.రాజమౌళి ది….అలాంటి రాజమౌళి సినిమాలకు అద్బుతమైన కథలను అందించే ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథా రచయితగా ఎంత సక్సెస్ అయినా దర్శకుడిగా అనుకున్న రేంజ్ లో సక్సెస్ అవ్వలేక పోయారు…చేసిన సినిమాల ఫలితాలు ఏవి ఆశించిన విధంగా రాకపోవడంతో ఎవ్వరూ ఊహించని సబ్జెక్ట్ తో ఇప్పుడు శ్రీవల్లీ అనే సినిమా ప్రేక్షకులముందుకు రానున్నారు.

వచ్చే వారం రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్నా అనుకోకుండా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది…ఎట్టకేలకు వచ్చే వారం రిలీజ్ కి సిద్ధం అవుతున్నా ఈ సినిమాపై ఎలాంటి హైప్ లేకపోవడం తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని ప్రమోషన్ కి పిలిచారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాజమౌళి మీద గౌరవం తో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి 10 న వెళుతుండగా ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది ఈ సినిమా…మరి ఈ ఎఫెక్ట్ సినిమాపై కూడా పడి మంచి విజయం సాధిస్తుందా లేదా వచ్చే వారం తెలియనుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here