నేనే రాజు నేనే మంత్రి రెండోరోజు కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

రానా తేజ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ నేనే రాజు నేనే మంత్రి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటిరోజు వరల్డ్ వైడ్ గా 5 కోట్ల షేర్ మార్క్ ని అందుకోగా రెండోరోజు కూడా స్ట్రాంగ్ గా హోల్డ్ చేసి లీడింగ్ లో దూసుకుపోయింది.

అడ్వాన్స్ బుకింగ్ పరంగా మిగిలిన సినిమాల కన్నా బెటర్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్న ఈ సినిమా మొత్తంగా రెండోరోజు కూడా 3 కోట్లకు పైగా షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అందుకు౦ది. సినిమా చాలా వరకు ఓన్ గా రిలీజ్ అవ్వడం, బడ్జెట్ కూడా తక్కువ అవ్వడం ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్.

ఈ లాంగ్ వీకెండ్ లో సేఫ్ గా నిలిచే మొదటి సినిమా ఇదే అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రానా ఖాతాలో ఈ సినిమా వరుసగా ఈ ఏడాది మూడో విజయమే అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Leave a Comment