86 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రని రఫ్ఫాడించిన మగధీరుడు…NO 1

0
416

  టాలీవుడ్ లో ఇప్పటికీ ఎప్పటికీ మెగాస్టార్ చిరంజీవి ఒక్కరే…10 ఏళ్ల తర్వాత కంబ్యాక్ చేసినా కానీ తెలుగు సినిమా చరిత్రలో ఉన్న అన్ని రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్న చిరంజీవి వీర ప్రతాపం చూసి అందరు షాక్ అయ్యారు. ఖైదీనంబర్ 150 నెలకొల్పిన రికార్డులను అందుకోవడానికి మిగిలిన హీరోలు ప్రయత్నిస్తున్నా అందుకోలేక పోయారు. అందులో టోటల్ రన్ లో మెగాస్టార్ నెలకొల్పిన 164 కోట్ల రికార్డ్ ఒకటి కాగా ఆ రికార్డ్ మొన్నటి వరకు అలాగే ఉంది.

ఉన్న సినిమాల్లో ఒక్క శ్రీమంతుడు మాత్రమె 150 కోట్లతో క్లోజ్ గా వచ్చి ఆగిపోయింది. ఇలాంటి సమయంలో మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం సినిమాతో బరిలోకి టాలీవుడ్ చరిత్రలో ఉన్న అన్ని ఏరియాల రికార్డులను బ్రేక్ చేసి సంచలనం సృష్టించాడు.

అందులో మెగాస్టార్ చిరంజీవి పేరిట ఉన్న 164 కోట్ల రికార్డును కూడా బ్రేక్ చేసి ఏకంగా 175 కోట్ల మార్క్ ని అందుకుని ఆల్ టైం హిస్టారికల్ రికార్డ్ ను నెలకొల్పాడు. తండ్రిని మించిన తనయుడుగా ఇప్పుడు అందరి చేత కీర్తించబడుతున్న మెగా పవర్ స్టార్ రానున్న రోజుల్లో రంగస్థలం సినిమాతో మరిన్ని రికార్డులను నమోదు చేయడం ఖాయం అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here