రంగస్థలం నిర్మాతలు అనౌన్స్ చేసిన రెండు వారల అఫీషియల్ కలెక్షన్స్ ఇవే!!

0
533

  బాక్స్ ఆఫీస్ దగ్గర పెను సంచలన రికార్డులు నమోదు చేస్తూ దూసుకు పోయిన రంగస్థలం సినిమా దిగ్విజయంగా రెండు వారలను పూర్తి చేసుకుని సత్తా చాటింది. కాగా సినిమా రెండు వారాల్లో అఫీషియల్ గా ఎంత కలెక్ట్ చేసింది అనేది ఆసక్తిగా మారగా సినిమా నిర్మాతలు సినిమా అఫీషియల్ కలెక్షన్స్ ని తెలియజేసి షాక్ ఇచ్చారు. సినిమా 13 రోజుల్లో టోటల్ గా 98.3 కోట్ల షేర్ ని అందుకోగా 14 వ రోజున టోటల్ గా 1 కోటి షేర్ ని అందుకుంది.

కాగా సినిమా రెండు వారాల్లో టోటల్ గా 99.3 కోట్ల షేర్ ని అందుకోగా రెండో వారం లో సినిమాకి ఓవర్ ఫ్లో కలెక్షన్స్ కింద సుమారు 70 లక్షల మేర దక్కినట్లు అనౌన్స్ చేశారు నిర్మాతలు. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాల్లో 100 కోట్ల షేర్ ని అందుకుంది.

దాంతో పాటే టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 162 కోట్ల మార్క్ ని అందుకున్నట్లు సమాచారం. దాంతో సినిమా అఫీషియల్ గా కేవలం 14 రోజుల్లోనే 100 కోట్ల షేర్ మార్క్ ని అందుకోవడం తో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మరి టోటల్ రన్ లో 104 కోట్ల ఖైదీనంబర్ 150 ని బ్రేక్ చేస్తుందా లేదా చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here