ఏంటయ్యా రామ్ చరణ్…ఏంటి వీర లెవల్ విద్వంసం అసలు??

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రంగస్థలం 1985 ఎప్పు డెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని అభి మానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాల తో రూపొందుతున్న ఈ క్లాస్ మూవీ కి సుకుమార్ డైరెక్టర్ అవ్వడం తో రామ్ చరణ్ ని సరికొత్తగా చూప బోతున్నాడు. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుక గా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం అందరి కీ తెలిసిందే.

కాగా ఈ సినిమాకి ఇప్పటి నుండే బిజినెస్ రూపంలో అల్టిమేట్ ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా సీడెడ్ ఏరియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్స్ లో ఒకరిగా నిలిచిన రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ కి దిమ్మతిరిగే ఆఫర్ వచ్చినట్లు ఇప్పుడు ఇండస్ట్రీ లో చెప్పుకుంటున్నారు.

ఒకటి కాదు 2 కాదు ఏకంగా 12 కోట్ల ఆఫర్ రంగస్థలం 1985 కి దక్కినట్లు చెబుతుండగా ఇది రామ్ చరణ్ కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ రేటు అని అంటున్నారు. ఇక సినిమా ఫస్ట్ లుక్ అతి త్వరలోనే రిలీజ్ కానుండగా సినిమా ట్రైలర్ డిసెంబర్ లో లాంచ్ కానున్నట్లు సమాచారం.

Leave a Comment