రంగస్థలం 207 కి 122…మరి భరత్ అనే నేను 205 కి ఎంత వచ్చింది!!

0
494

బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం మూడు వారల గ్యాప్ తో రెండు తెలుగు సినిమాలు చరిత్రకెక్కాయి. ఆల్ మోస్ట్ ఈక్వల్ రేటింగ్ తో ఈక్వల్ టాక్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే వసూళ్లు సాధించాయి. కానీ ముందు వచ్చిన సినిమాకి ఓపెన్ గ్రౌండ్ ఉండటం లోకల్ ఫీలింగ్ ఎక్కువగా ఉండటం కలిసి రాగా రెండో సినిమాకి తీవ్ర పోటి ఉండటం కొద్ది వరకు ఎఫెక్ట్ చూపినా మంచి వసూళ్లు సాధిస్తుంది ఆ సినిమా. 

ఆ రెండు సినిమాలే రంగస్థలం మరియు భరత్ అనే నేను. రంగస్థలం రీసెంట్ గా 6 వారలను పూర్తీ చేసుకుని 122.7 కోట్ల షేర్ ని 207 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని టాలీవుడ్ లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది.

కాగా రీసెంట్ గా భరత్ అనే నేను నిర్మాతలు అఫీషియల్ గా మూడు వారాలకే 205 కోట్ల గ్రాస్ ని అందుకుందని అనౌన్స్ చేశారు. కానీ షేర్ వివరాలు మాత్రం ఎంత వరకు వచ్చాయి అన్నది చెప్పలేదు. ట్రేడ్ వర్గాలు మూడు వారాల్లో 94 కోట్ల రేంజ్ లో షేర్ వచ్చింది అని చెబుతున్నా…నిర్మాతలు 205 కోట్ల పోస్టర్ ని వదిలారు కాబట్టి 120 కోట్ల షేర్ ని సినిమా సాధించాలి అని విశ్లేషకులు అంటున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here