రంగస్థలం 69…భరత్ అనే నేను 77…ఏం కొట్టాడు సామి!!

0
794

  బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము లేపే వసూళ్ళతో జోరు మీదున్న భరత్ అనే నేను సినిమా రెండు తెలుగు రాష్ట్రాల ఆవల కూడా అదే రేంజ్ లో కలెక్షన్స్ మ్రోత మ్రోగిస్తుంది. ముఖ్యంగా రిలీజ్ కి ముందు రోజు వరకు స్ట్రైక్ వలన సినిమాలు లేని తమిళనాడులో భారీ ఎత్తున స్ట్రైక్ ఆగిపోవడంతో రిలీజ్ అయిన భరత్ అనే నేను అక్కడ అద్బుతమైన కలెక్షన్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

సినిమా మొదటి రోజు చెన్నై ఏరియాల్లో సెన్సేషన్ రికార్డ్ కొట్టి తెలుగు సినిమాల్లో సరికొత్త రికార్డ్ కొట్టగా మొత్తం మీద మొదటి రోజు వసూళ్ళ పరంగాను అక్కడ సరికొత్త ఇండస్ట్రీ రికార్డ్ ను నెలకొల్పి షాక్ ఇచ్చింది. అక్కడ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం సినిమా.

మొదటి రోజు మొత్తం మీద 69 లక్షల గ్రాస్ వసూల్ చేయగా ఆ రికార్డ్ ను బ్రేక్ చేసిన భరత్ అనే నేను మొదటి రోజు మొత్తం మీద 77 లక్షల గ్రాస్ ని వసూల్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసి సరికొత్త ఇండస్ట్రీ రికార్డ్ ను నమోదు చేసింది. రెండో రోజు కూడా అక్కడ సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకు పోతుంది అంట ఈ సినిమా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here