2 సినిమాలు కలిసి 86 ఏళ్ల చరిత్ర చింపేశాయి…రికార్డ్ తెలిస్తే షాక్!!

0
494

  కేవలం 21 రోజుల గ్యాప్ తో రెండు సినిమాలు తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. రంగస్థలం మరియు భరత్ అనే నేను రెండు సినిమాల జోరు చూసి టోటల్ టాలీవుడ్ కూడా ఇంత తక్కువ సమయంలో రెండు అద్బుతమైన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రేంజ్ భీభత్సం సృష్టించడం చూసి షాక్ అయ్యాయనే చెప్పాలి. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్ లెవల్ కలెక్షన్స్ ని కలెక్ట్ చేశాయి ఈ సినిమాలు.

అతి తక్కువ గ్యాప్ తో ఏకంగా రెండు సినిమాల లెక్క 200 కోట్లకు పైగా ఉండటం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది…ఒకపక్క రంగస్థలం 120 కోట్ల వైపు అడుగులు వేస్తుంటే…మరో పక్క భరత్ అనే నేను కూడా 80 కోట్ల రేంజ్ లో దుమ్ము లేపింది.

దాంతో ఇది అల్టిమేట్ రికార్డ్ అనే చెప్పాలి…2015 లో బాహుబలి మరియు శ్రీమంతుడు నెల గ్యాప్ లో ఈ రికార్డ్ కొట్టింది. 2017 లో సంక్రాంతి సీజన్ మూవీస్ 190 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేశాయి. కానీ ఇప్పుడు 20 రోజుల్లో గ్యాప్ లో 200 కోట్ల షేర్ ని వసూల్ చేసి ఈ రెండు సినిమాలు చరిత్ర సృష్టించాయి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here