మెర్సల్ 75 రోజుల్లో అవుట్…రంగస్థలం హిస్టారికల్ సౌత్ రికార్డ్!!

0
429

  సౌత్ ఇండస్ట్రీ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన సినిమాలు రీసెంట్ గా పెరుగుతూ వస్తున్నాయి. బాహుబలి తో మన మార్కెట్ రోబో తో కోలివుడ్ మార్కెట్ భారీ గా పెరగడం తో సరైన సినిమా పడితే చాలు స్టార్ హీరోల సినిమాలకు అల్టిమేట్ కలెక్షన్స్ వస్తున్నాయి. తమిళ్ లో రీసెంట్ గా వచ్చిన మూవీస్ లో ఇలయధలపతి విజయ్ నటించిన మెర్సల్ సినిమా సౌత్ రికార్డులను బ్రేక్ చేసింది.

ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా టోటల్ రన్ లో 127.2 కోట్ల షేర్ ని 244 కోట్ల గ్రాస్ ని వసూల్ చేసి తమిళ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. అలాంటి సినిమా రికార్డును మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం సినిమా బ్రేక్ చేసింది.

రీసెంట్ గా టోటల్ రన్ ని ముగించుకున్న ఈ సినిమా (రంగస్థలం టోటల్ కలెక్షన్స్) టోటల్ రన్ లో ఏకంగా 127.3 కోట్ల షేర్ ని సాధించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాదు మెర్సల్ సినిమా రికార్డ్ ను కూడా బ్రేక్ చేసింది. ఇక్కడ విశేషం ఏంటి అంటే మెర్సల్ తెలుగు డబ్బింగ్ తో కలిపి కలెక్షన్స్ ని సాధిస్తే రంగస్థలం డైరెక్ట్ తెలుగు తోనే చుక్కలు చూయించింది.

Telugu Posts

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here