ఇదేమి సినిమా అవేమి కలెక్షన్స్…ట్రూ బ్లాక్ బస్టర్ !!

0
381

రామ్ చరణ్ మూవీ రంగస్థలం మూవీ అసలు సిసలైన బ్లాక్  బస్టర్ కు అర్ధం చెప్పింది. ప్రతీ ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లు.. బయ్యర్లకు విపరీతమైన లాభాలను తెచ్చిపెట్టింది. అయితే.. పలు చిత్రాలు లోకల్ గా బాగా ఆడినా.. యూఎస్ లో వసూలు చేయలేకపోతున్నాయి. అక్కడ మంచి వసూళ్లు రాబట్టినా.. అవి కొనుగోలు ప్లస్ ఖర్చులమేరకే అవుతున్నాయి. కానీ రామ్ చరణ్ మూవీ రంగస్థలం లెక్క మాత్రం విభిన్నంగా ఉంది. కేవలం ఓవర్సీస్ బయ్యర్లకే మిలియన్ డాలర్ల లాభాలను పంచిపెట్టింది. ఈ సినిమాను ఓవర్సీస్ రైట్స్ ను 9 కోట్లకు విక్రయించారు. యూఎస్ లో 3.5 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే.

ఇందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ 1.9 మిలయన్ డాలర్లు. వీపీఎఫ్.. పబ్లిసిటీ ఖర్చులు తీసేస్తే.. 1.75 మిలియన్ డాలర్లు మిగులుతుంది. నాన్-యూఎస్ఏ మార్కెట్ల నుంచి 2.2 కోట్ల రూపాయలు వచ్చాయి. అంటే 13.65 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ ను రంగస్థలం మూవీ రాబట్టిందన్న మాట.  మొత్తం 9 కోట్లకు కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్ కు.. 4.65 కోట్ల రూపాయలు నికరంగా మిగులు వచ్చిందనే సంగతి అర్ధమవుతుంది. అంటే షుమారు 1 మిలియన్ అనుకోండి. 

ఓ సినిమా కాస్ట్ ప్రైస్ లో సగానికి పైగా లాభాలను పంచి పెట్టడం అంటే.. గత కొన్నేళ్లలో ఇదే తొలిసారి. రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్ ఈ అద్భుతమైన ఫీట్ ను సాధించి.. టాలీవుడ్ సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ లో మళ్లీ జోష్ ఇచ్చింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here