ఇదీ షాకింగ్ రికార్డ్…ప్రయోగంతో 16 కొట్టి చరిత్రకెక్కాడు!!

0
396

  టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సుకుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ రంగస్థలం బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే వసూళ్ళతో సెన్సేషనల్ రికార్డులతో మూడు వారాల్లో 110 కోట్లకు పైగా షేర్ ని వసూల్ చేసింది…కాగా ఇప్పుడు 4 వ వారం లో ఎంటర్ అయ్యాక కూడా జోరు ఏమాత్రం ఆగకుండా కొనసాగుతున్న రంగస్థలం కలెక్షన్స్ ప్రవాహంలో మరో అల్టిమేట్ రికార్డ్ ఒకటి వచ్చి చేరింది అని చెప్పొచ్చు.

రిలీజ్ కి ముందు వరకు అతి పెద్ద ప్రయోగం అని, మాస్ ఎలిమెంట్స్ అస్సలు లేవని అనుకున్న వాళ్ళు సీడెడ్ ఈ సినిమా 12.6 కోట్ల బిజినెస్ చేయడంతో కొంత టెన్షన్ పడి బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో అని టెన్షన్ పడ్డారు. కానీ రంగస్థలం మూడు వారాల్లో ఇక్కడ చరిత్రకెక్కింది.

ఖైదీనంబర్ 150….15.2 కోట్ల షేర్ రికార్డును బ్రేక్ చేసింది. ఇక ఇప్పుడు 16 కోట్ల మైలురాయి ని అధిగమించి మరో చారిత్రిక రికార్డ్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా….ఇది తెలుగు సినిమా చరిత్ర లోనే ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్ అని చెప్పాలి. ఈ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన రంగస్థలం టోటల్ రన్ లో 17 కోట్లకు పైగానే కలెక్ట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here