24 గంటలు 2.8 మిలియన్…ఏం క్రేజ్ సామి ఇది!!

0
240

రంగస్థలం’ సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇమేజ్ ను అమాంతం ఆకాశమంత ఎత్తుకు పెంచేసింది. నాన్- బాహుబలి రికార్డులన్నీ చెరిపేసి వీరలెవెల్లో కలెక్షన్లు సాధించింది. 1980ల నాటి గ్రామీణ పరిస్థితులకు తగ్గట్టుగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన ఊర మాస్ బీట్ సాంగ్స్ మాస్ జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఐటెమ్ సాంగ్స్ స్పెషలిస్ట్ దేవీ కంపోజ్ చేసిన ‘జిగేలు రాణి’ పాటకి రెస్పాన్స్ అదిరిపోయింది. థియేటర్లలో ప్రేక్షకులతో విజిల్స్ వేయించిన ‘జిగేలు రాణి’ పాట ఇప్పుడు యూట్యూబ్ లో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈరోజు ‘రంగస్థలం’ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఒక్కరోజు ముందుగానే యూట్యూబ్ లో ‘జిగేలు రాణి’ పాటను విడుదల చేశారు. 12 గంటల్లోనే 2 మిలియన్ల వ్యూస్ దాటేసిన జిగేలు రాణి… ఒక్క రోజులో 2.8 మిలియన్ల వ్యూస్ రాబట్టింది. టీజర్… ట్రైలర్ లకు మాత్రమే ఈ స్థాయిలో రెస్పాన్స్ వస్తుంటుంది. అలాంటి ఓ ఐటెం సాంగ్ వీడియోకు ఇంత భారీ వ్యూస్ రావడం మాత్రం నిజంగా ఓ రికార్డే. దేవి ఊర మాస్ బీటులకు తగ్గట్టుగా శరీరాన్ని ఆడిస్తూ చెర్రీ చేసిన స్టెప్పులు నెటిజనులను బాగా ఆకట్టుకుంటున్నాయి.


ఈ పాటలో హీరోయిన్ పూజా హెగ్దే ఒలికించిన అందాలు కూడా ఈ పాట ఇంత భారీ హిట్టు కావడానికి  ప్రధాన కారణం. సుకుమార్ తెరకెక్కించిన ‘రంగస్థలం’ సినిమా మార్చి 30న విడుదలైన నాన్- బాహుబలి రికార్డులన్నీ బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here