షాక్…ఇన్ని రికార్డులు కొట్టినా 2 బాలెన్స్ అంట…ఏంటది??

0
389

  టాలీవుడ్ చరిత్రలోనే ఆల్ టైం రికార్డ్ లెవల్ కలెక్షన్స్ తో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలవబోతున్న సినిమా రంగస్థలం ఇప్పటికే అనేక రికార్డులను బ్రేక్ చేసి తెలుగు సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్న సమయంలో ఇప్పటికీ సినిమా 2 రికార్డులను బ్రేక్ చేయాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సరికొత్త ఇండస్ట్రీ రికార్డులకు కొలవు గా ఉన్న రంగస్థలం సినిమా రెండు వారాలలోనే 100 కోట్ల షేర్ మార్క్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.

కాగా ఇక మీదట సినిమా బ్రేక్ చేయాల్సిన రికార్డులలో నైజాంలో పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది నెలకొల్పిన 23.75 కోట్ల షేర్ రికార్డ్ మరియు సీడెడ్ లో మెగాస్టార్ చిరంజీవి పేరిట ఉన్న 15 కోట్ల షేర్ రికార్డులను రెండు ఈ సినిమా బ్రేక్ చేయాల్సి ఉంది…

నైజాంలో ప్రస్తుతం 22 కోట్లకు చేరువగా ఉన్న ఈ సినిమా అత్తారింటికి దారేది రికార్డును అందుకుంటుందో లేదో ఇంకా తేలాల్సి ఉండగా సీడెడ్ లో మాత్రం ప్రస్తుతం… 14.4 కోట్ల రేంజ్ లో షేర్ తో ఉన్న రంగస్థలం కచ్చితంగా 15 కోట్ల రికార్డ్ ను అందుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి…మరి అది ఎన్ని రోజుల్లో జరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here