పరాయిగడ్డపై ఇండస్ట్రీ రికార్డ్…మీసం మేలేస్తున్న ఫ్యాన్స్…

0
362

  టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సుకుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ రంగస్థలం బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే వసూళ్ళతో అల్టిమేట్ రికార్డులతో ఇప్పటికీ సూపర్బ్ బాక్స్ ఆఫీస్ రన్ ని కొనసాగిస్తుంది. కాగా మూవీ రెండు రాష్ట్రాల్లో ఇప్పటికే అనేక రికార్డులను నెలకొల్పగా ఇప్పుడు తమిళనాడు లో టోటల్ రన్ కి చేరువగా వచ్చిన రంగస్థలం అక్కడ సరికొత్త ఇండస్ట్రీ రికార్డును సొంతం చేసుకుంది…

అక్కడ టోటల్ రన్ లో ఈ సినిమా 2.94 కోట్ల గ్రాస్ ని అందుకుని తెలుగు సినిమాల పరంగా తమిళనాడు లో అత్యధిక గ్రాస్ వసూల్ చేసి చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో జైలవకుశ 2.7 కోట్ల రికార్డ్ ను కూడా బ్రేక్ చేసి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

కాగా సినిమా అక్కడ ఆల్ మోస్ట్ రన్ ని ముగించగా ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు వస్తున్న నేపధ్యంలో సినిమా మరిన్ని అద్బుతాలు టోటల్ రన్ లో సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే సినిమా 112 కోట్ల కి పైగా షేర్ తో సెన్సేషన్ క్రియేట్ చేయగా టోటల్ రన్ లో 115 కోట్ల మార్క్ ని క్రాస్ చేయడం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here