రిలీజ్ కి ముందే బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేసిన జైలవకుశ…మాస్ హిస్టీరియా

  వరుస హిట్ల తో సినిమా సినిమా కి తన రేంజ్ ని పెంచుకుంటూ సింహాద్రి సినిమా తర్వాత ఉన్న హ్యుఫోరియాని మించిన క్రేజ్ ని ఇప్పుడు సొంతం చేసుకున్న హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్… జనతాగ్యారేజ్ తో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన ఈ టైగర్ ఇప్పుడు జైలవకుశ సినిమా తో రిలీజ్ కి ముందే భారీ రికార్డులను సృష్టిస్తూ భీభత్సం సృష్టిస్తున్నాడు. జైలవకుశ ఓపెనింగ్స్ పరంగా సంచలనాలు సృష్టించే అవకాశం పుష్కలంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.’

కాగా నైజాం ఏరియాలో జైలవకుశ సినిమా రిలీజ్ కి ముందే నాన్ బాహుబలి రికార్డులను నమోదు చేసి సంచలనం సృష్టించింది…బాహుబలి 2 కి అప్పటి పరిస్తితులలో ఏకంగా 412 థియేటర్స్ నైజాం ఏరియాలో దక్కినట్లు సమాచారం.

కాగా జైలవకుశ సినిమాకు ఏకంగా 425 థియేటర్స్ మొదటి రోజు అందుబాటులో ఉండటం తో జైలవకుశ బాహుబలి 2 రికార్డును రిలీజ్ కి ముందే బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. మరి మొదటి రోజు కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో తెలియాలి అంటే 22 వరకు ఆగాల్సిందే..

Leave a Comment