రిలీజ్ కి ముందు డౌట్…కానీ ఇప్పుడు రిపీట్ ఆడియన్స్ తో భీభత్సం

0
186

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాయిపల్లవి కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఫిదా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారం దిగ్విజయంగా ముగించుకుని సంచలన కలెక్షన్స్ తో దుమ్ము రేపింది.

కానీ సినిమా రిలీజ్ కి ముందు ఇంత పాజిటివ్ నెస్ మాత్రం సినిమాకు దక్కలేదు…టీసర్ కానీ ట్రైలర్ కానీ ఆశించిన స్పందన రాలేదు…ఎదో యావరేజ్ లవ్ స్టొరీలా ఉందనుకున్నవాళ్ళే ఎక్కువ అని చెప్పాలి..కానీ సినిమా ఒక్కసారి రిలీజ్ అయిన తర్వాత యునానిమస్ పాజిటివ్ టాక్ తో దుమ్ము రేపింది.

చూసినవాల్లె మళ్ళీ రిపీట్ ఆడియన్స్ గా మారుతుండటం ఈ మధ్యకాలంలో ఈ సినిమాకే చెల్లింది అని చెబుతున్నారు. ఓ చిన్న ట్రాన్స్ లో ఉన్నట్లు మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించేలా మ్యాజిక్ చేసిన ఫిదా ఆడియన్స్ మనసును గెలుచుకున్న అతికొద్ది సినిమాలలో ఒకటి అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here