మెగా మేనల్లుడు ఈ రేంజ్ లో కుమ్మాడు ఏంటి సామి!!

  ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా రూపొందిన
‘ఇంటిలిజెంట్’ చిత్రం ఫస్ట్ లుక్ ఈరోజు సాయంత్రం విడుదలైంది. ఈ ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం తమ సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేసింది. నుదుటిపై గాయంతో ఉన్న సాయిధరమ్ తేజ్ సీరియస్ గా చూస్తూ ఈ ఫస్ట్ లుక్ లో ఉన్నాడు. కాగా, ‘ఇంటిలిజెంట్’ టైటిల్ కింద ఇంగ్లీషులో ‘INTTELLIGENT’ అని రాసి ఉండటం పై…..

ఆ పదంలో అక్షర దోషం ఉందని భావించిన పలువురు నెటిజన్లు, దానిని సరిదిద్దుకోవాలని చిత్రయూనిట్ కి సూచించారు. అయితే, అది అక్షర దోషం కాదని న్యూమరాలజీ కరెక్షన్ నిమిత్తం ఆ పదంలో ఒక ‘T’ని అదనంగా కలపాల్సి వచ్చిందని చిత్రయూనిట్ చెప్పినట్టు సమాచారం.

వచ్చే నెల 9వ తేదీన ‘ఇంటిలిజెంట్’ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘ఇంటిలిజెంట్’ కోసం సాయిధరమ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా సినిమా టీసర్ ని అతి త్వరలోనే రిలీజ్ చేయనున్నారు…అలాగే ఫిబ్రవరి 9 న భారీ గా సినిమాలు ఉన్న నేపధ్యంలో ఈ సినిమా ఎంతవరకు ఆ స్లాట్ ని అందుకుంటుంది అనేది కూడా ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.

Leave a Comment