సమ్మోహనం ఓవర్సీస్ రివ్యూ…హిట్టా—ఫట్టా!! | 123Josh.com
Home న్యూస్ సమ్మోహనం ఓవర్సీస్ రివ్యూ…హిట్టా—ఫట్టా!!

సమ్మోహనం ఓవర్సీస్ రివ్యూ…హిట్టా—ఫట్టా!!

0
3384

          స్టార్ బ్యాగ్ డ్రాప్ ఉన్నా ప్రేమ కథా చిత్రం విజయం లాంటి సరైన హిట్ పడినా తర్వాత కెరీర్ ని సరిగ్గా మలుచుకోవడంలో విఫలం అయ్యాడు సుధీర్ బాబు, మళ్ళీ ప్రేమ కథా చిత్రం లాంటి విజయం కోసం ఎదురు చూస్తున్న సుధీర్ బాబు ఈ సారి బాలీవుడ్ హీరోయిన్ అదితి రావ్ హైదరి హీరోయిన్ గా ఇంద్రగంటి మోహనకృష్ణ లాంటి డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీస్ చేసే డైరెక్టర్ డైరెక్షన్ లో సమ్మోహనం అనే సినిమా చేశాడు.

రీసెంట్ గా రిలీజ్ అయిన టీసర్ ట్రైలర్ సాంగ్స్ అన్నీ పాజిటివ్ బజ్ సొంతం చేసుకున్న ఈ సినిమా మరి కొన్ని గంటల్లో రెగ్యులర్ షోల ని జరుపుకుంటుండగా ఓవర్సీస్ లో సినిమా మొదటి షో లను పూర్తీ చేసుకుని టాక్ ఏంటో బయటికి వచ్చేసింది.

మరి సినిమా ఎలా ఉంది టాక్ ఏంటి తెలుసుకుందాం పదండి… కథ గురించి సింపుల్ గా సినిమా వాళ్ళంటే పడని హీరో అనుకోకుండా సినిమా హీరోయిన్ తోనే ప్రేమ లో పడతాడు, మరి తన ప్రేమలో ఎదుర్కొన్న ఇబ్బందులు ఎలాంటివి…

తిరిగి ప్రేమ సఫలం అయిందా లేదా అన్నది సినిమా కథ…కథ పాయింట్ సింపుల్ గా ఉన్న దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటుందట…మొదటి ఫ్రేం నుండే సినిమా ఎలా ఉండబోతుందో అర్ధం అవుతుందని అంటున్నారు.

మోహనకృష్ణ స్టైల్ లో ఉండే కామెడీ సీన్స్ తో మొదలైన సినిమా ఆసక్తికరమైన ప్రేమతో టర్న్ తీసుకోగా ప్రేమలో ఎదురయ్యే ఇబ్బందులు ఒక హీరోయిన్ కి సామాన్య అబ్బాయికి మధ్య జరిగితే ఎలా ఉంటుంది అన్న పాయింట్ పై… దర్శకుడు…

ఆసక్తికరమైన సన్నివేశాలతో ఆద్యంతం ఆకట్టుకునేలా తెరకెక్కించాడని అంటున్నారు. సుధీర్ బాబులో మంచి నటుడు ఉన్నాడు అని కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ లాంటి సినిమాలతో ప్రూవ్ అయ్యింది. ఈ సినిమా లో కూడా…

నటుడిగా తానేంటో ప్రూవ్ చేసుకున్నాడని, డాన్సులు కూడా ఆకట్టుకున్నాడని అంటున్నారు. ఇక హీరోయిన్ అదిరి రావ్ స్క్రీన్ ప్రజెన్స్ అదిరిపోయిందని…ఇద్దరి కెమిస్ట్రీ నటన ఆకట్టుకున్నాయని అంటున్నారు.

మిగిలిన నటీనటులలో హరితేజ నందు మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఆకట్టుకోగా సంగీతం సినిమాకి ప్లస్ పాయింట్స్ లో ఒకటని బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా ఫీల్ కి తగ్గట్లు ఉందని అంటున్నారు. ఎడిటింగ్ బాగున్నా సెకెండ్ ఆఫ్ లో కొన్ని సీన్స్ ని ఎడిట్ చేసి ఉంటె మరింత షార్ప్ గా ఉండేదని అంటున్నారు.

ఇక దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ మరోసారి డిఫెరెంట్ స్టొరీ తో వచ్చి ఆకట్టుకోవడమే కాకుండా ఓ మంచి సినిమాను చూసిన ఫీలింగ్ ని కలిగించాడని అంటున్నారు. మరీ అద్బుతం అనలేం కానీ మంచి లవ్ స్టొరీ చూసిన ఫీలింగ్ ఉంటుందని అంటున్నారు.

ఓవర్సీస్ ఆడియన్స్ క్లాస్ మూవీస్ ని ఇష్టపడటం కామన్ పాయింట్ అవ్వడంతో సినిమా కి అక్కడ మంచి టాక్ లభించింది. ఇప్పుడు రెగ్యులర్ కామన్ ఆడియన్స్ టాక్ కూడా ఇలానే ఉంటె సుధీర్ బాబు కి నికార్సయిన హిట్ పడినట్లే అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here